Breaking News

20 ఏళ్ల తర్వాత వచ్చి.. కోల్‌కతాలో తస్లీమా సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 08/02/2026 - 12:53

కోల్‌కతా: దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కోల్‌కతాలో అడుగుపెట్టారు. అన్యాయం ఎంతకాలం కొనసాగినా అది శాశ్వతం కాదనడానికి తన రాక ఒక నిదర్శనమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ఏ రచయిత కూడా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆమె ఆకాంక్షించారు.

శనివారం కోల్‌కతాలో నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ భావోద్వేగంతో మాట్లాడారు. తాను కోల్పోయిన జీవితంలో ఒక భాగాన్ని తిరిగి పొందిన అనుభూతి కలుగుతోందన్నారు. మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకే తాను ఇక్కడకు వచ్చానని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. యూరప్ తనకు ఆశ్రయం కల్పించినప్పటికీ, బంగ్లాదేశ్ లేదా పశ్చిమ బెంగాల్‌లో కనీసం నివసించడానికి ఒక చిన్న చోటు కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రచనల కారణంగా మత ఛాందసుల వ్యతిరేకతను ఎదుర్కొంటూ దేశ బహిష్కరణ శిక్ష అనుభవించాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని రవీంద్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తస్లీమా నస్రీన్ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాజ్యాంగం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు రాష్ట్రంలో పూర్తి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఆమె రాసిన ‘ద్విఖండితో’ ఆత్మకథలోని కొన్ని అంశాలు వివాదాస్పదం కావడంతో, 2007 నవంబర్‌లో అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆమెను కోల్‌కతా నుంచి బహిష్కరించింది. ఇస్లామిక్ ఛాందసవాదుల బెదిరింపుల కారణంగా ఆమె 1994లో బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ప్రవాస జీవితం గడుపుతున్నారు.

ఇది కూడా చదవండి: సిద్ధివినాయక ఆలయంలో రూ. 18 కోట్ల కుంభకోణం?

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)