Breaking News

టీచర్‌ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి..

Published on Wed, 07/22/2026 - 08:22

తమిళనాడు: కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో స్నానం చేస్తున్న ఉపాధ్యాయురాలిని రహస్యంగా వీడియో తీసి, బెదిరించి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు దానిని రికార్డ్‌ చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు కూడా సదరు టీచర్‌ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. 

త‌మిళ‌నాడు కన్యాకుమారి జిల్లా తక్కలై సమీప ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల ఉపాధ్యాయురాలు మదురై హైకోర్టు బెంచ్‌లో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ‘‘నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. నా భర్త టెంపో డ్రైవర్‌. నేను నా ఇంటి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన జయకాంతన్‌ అనే వ్యక్తి రహస్యంగా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, నిరంతరం వేధింపులకు గురిచేశాడు’’ అని ఆ పేర్కొన్నారు. నిందితుడు తనను భయపెట్టి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, అతని స్నేహితుడు కూడా ఈ విషయం తెలుసుకుని తనను వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆదేశాల మేరకు తక్కలై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై సమాచార సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, బలవంతపు వేధింపులు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)