Breaking News

ఇకపై శనివారం కూడా బడి?

Published on Sun, 06/11/2023 - 07:23

సాక్షి, చెన్నై: ఇకపై ప్రతి శనివారం కూడా పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే తరగతుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవులే. ఈ పరిస్థితుల్లో తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కొంత ఆలస్యమైంది. భానుడి ప్రతాపం పుణ్యమా రెండు సార్లు పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేశారు. సోమవారం నుంచి 6–12 తరగతులకు, ఈనెల 14 వతేదీ నుంచి 1–5 తరగతులకు పాఠశాలలు తెరచుకోనున్నాయి.

 అదే సమయంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతోవ ర్షాలు ఆశాజనకంగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకడంలో రాష్ట్రంలో అనేక జిల్లాలో తేలిక పాటి వర్షం మొదలైంది. శనివారం చెన్నై , శివారులలో అనేక చోట్ల వర్షం పడింది. ఈవర్షం ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో పాఠశాలలకు తరచూ సెలవులు ఇవ్వక తప్పదు. దీంతో ఈ సెలవులతో విద్యా బోధనలు కుంటు పడే పరిస్థితి ఉంది. 

దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి శనివారం కూడా పాఠశాలలు పనిచేసే విధంగా చర్యలకు సిద్ధమైంది. ఈ విషయంగా విద్యా మంత్రి అన్బిల్‌ మహేశ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరిశీలన జరుపుతున్నామన్నారు. సకాలంలో సిలబస్‌ ముగించాలంటే శనివారం కూడా తరగతుల నిర్వహణ అవశ్యమని, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సులను శని, ఆదివారం కూడా నడిపేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకుంది.   

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య