రంజితమే పాటకు డ్యాన్స్‌ ఇరగదీసిన కలెక్టర్.. వైరలవుతోన్న వీడియో

Published on Sun, 03/12/2023 - 15:28

తమిళ స్టార్‌ హీరో విజయ్ దళపతి, రష్మిక మందన నటించిన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రంలోని రంజితమే పాట ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్‌కు అనేకమంది రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి తమ టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా రంజితమే పాటకు ఏకంగా ఓ కలెక్టర్ డ్యాన్స్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లాల్సిందే..

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మహిళలు ఘనంగా జరుపుకున్నారు.  తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో జిల్లా కలెక్టరేట్‌లో వుమెన్స్‌ డేను సంబరంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో కలెక్టర్‌, ఇతర ఉద్యోగులతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అనంతరం వేదికపై ప్లే చేసిన పాటలకు పలువురు నృత్యాలు చేశారు.

ఇదే క్రమంలో కలెక్టర్ కూడా డ్యాన్స్ చేయాలని కోరడంతో దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు మూవీలోని రంజితమే అనే సాంగ్‌కు అద్బుతంగా డ్యాన్స్‌ చేశారు. ఇతర మహిళా అధికారులతో కలిసి అచ్చం రియల్ పాటలో మాదిరిగా ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కలెక్టర్‌ డ్యాన్స్‌పై సూపర్‌ మేడమ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)