Breaking News

బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..

Published on Fri, 06/05/2026 - 12:10

చెన్నై: తమిళనాడులో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీతో తన అనుబంధాన్ని ముగించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 18 నెలలుగా పార్టీ హైకమాండ్‌తో పలు అంశాలపై తనకు విభేదాలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీపై గౌరవం ఉంది కానీ.. అభిప్రాయ బేధాల కారణంగానే తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను కొత్త రాజకీయ ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఒంటరిగా తన దారి తాను ఏర్పరచుకుంటానని స్పష్టం చేశారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాని అన్నారు. దీంతో, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మరాయి. 

తాజాగా అన్నామలై రాజీనామాకు బీజేపీ హైకమాండ్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నామలై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మార్పు కోసం బీజేపీలో చేరాను. బీజేపీ భవిష్యత్‌ కోసం ఎంతో కృషి చేశాను. సమాజంలో మార్పు తేవాలని భావించాను. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. అభిప్రాయ బేధాల కారణంగా బీజేపీ నుంచి బయటకు వచ్చాను. 2025 డిసెంబర్‌లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పాను. ఎన్నికల తర్వాత వెళ్లాలని బీజేపీ అధిష్టానం చెప్పింది. 

గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతృత్వంతో అనేకసార్లు చర్చలు జరిపాను. నా అభిప్రాయ భేదాలను స్పష్టంగా వివరించాను. అయితే తమిళనాడులో పార్టీ భవిష్యత్ దిశపై మా అభిప్రాయాలు ఒకేలా లేవని చివరకు అర్థమైంది. తమిళనాడు ప్రజలు అర్థం చేసుకునే భాషలో జాతీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అభివృద్ధి కేంద్రిత, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే రాజకీయాల అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తాను. అందులో భాగంగా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. సామాన్యులకి నా పార్టీలో ప్రాధాన్యం ఇస్తాను. రాజకీయాల్లో కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదు. 
 

రాజకీయాల్లోకి వచ్చే ముందు రజినీకాంత్‌ సలహాలు తీసుకున్నాను. రజినీకాంత్‌ను నాతో కలిసి రావాలని కోరాను.  ఇక రాజకీయ ఉద్యమం మొదలుపెడుతున్నాను. ఒంటరిగా నా దారి నేను ఏర్పరచుకుంటాను. తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోలేను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. తమిళనాడు అభివృద్ధే నా ప్రధాన లక్క్ష్యం. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాను’ అని తెలిపారు. దీంతో, అన్నామలై వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యూహంపై, అలాగే దక్షిణాదిలో పార్టీ విస్తరణపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)