Breaking News

వీడు మనిషి కాదు.. భార్యను చంపి సెల్ఫీ..

Published on Tue, 12/02/2025 - 09:55

తమిళనాడు: నెల్లై  జిల్లాలో మహిళా హాస్టల్‌లో చొరబడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన వ్యక్తి బాలమురుగన్‌. అతని భార్య శ్రీప్రియ(32). వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమురుగన్, శ్రీప్రియల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి టౌన్‌హాల్‌ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. 

రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్‌లో ఆమె ఉంటోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలిసేందుకు బాలమురుగన్‌ నెల్లై నుంచి వచ్చాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీప్రియ బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలమురుగన్, తాను దాచి ఉంచిన  కత్తిని తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. కత్తి  వేటు మెడపై బలంగా పడడంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ మృతి చెందింది. భార్య రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతూ మృతి చెందింది.  

శ్రీప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహం పక్కన ఒక కుర్చీ వేసి అందులో కూర్చుని సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోను తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశాడు. అందులో ద్రోహానికి జీతం మరణం అని పోస్ట్‌ చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి  బాలమురుగన్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శ్రీప్రియ ఒక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, అందుకే  హత్య చేశానని బాలమురుగన్‌ పోలీసులకు తెలిపాడు. శ్రీప్రియను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆదివారం వచ్చానని, సముదాయించినట్లు నటించి ఆమెను హత్య చేశానని తెలిపాడు.    

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)