Breaking News

బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుశిక్ష.. ఐదు లక్షల జరిమానా

Published on Sat, 06/14/2025 - 07:48

సాక్షి, చెన్నై: తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేస్తున్న నేపథ్యంలో బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. 

వివరాల ప్రకారం.. తమిళనాడులో కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.

కాగా, బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్‌ లభించని విధంగా జైలుశిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం, బిల్లును గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి పంపించగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు.

బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తే జైలుకే..
అదేవిధంగా, తమిళనాడులో బయోమెడికల్ వ్యర్థాలను డంప్ చేసినందుకు విచారణ లేకుండా ప్రత్యక్ష జైలు శిక్ష విధించే బిల్లును మార్చి 24న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మాజీ న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 29న దీని చర్చ జరిపిన తరువాత ఆమోదించారు. అనంతరం, గవర్నర్‌కు పంపించడంతో.. ఈ బిల్లుకు కూడా గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా బయో మెడికల్ వ్యర్థాలను సేకరించిన లేదా పొరుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో వైద్య వ్యర్థాలను డంప్ చేసిన ఎవరైనా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలను ఉల్లంఘించినట్లు పరిగణించబడతారు. దీంతో, విచారణ లేకుండానే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)