Breaking News

సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

Published on Sat, 06/20/2026 - 17:09

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 21, 22 (ఆదివారం, సోమవారం) తేదీల్లో రాష్ట్రంలోని మూడు ప్రధాన జంతుప్రదర్శనశాలల్లో ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

అటవీ శాఖ మంత్రి ఆర్.వి.రంజిత్‌కుమార్ మాట్లాడుతూ.. వండలూరులోని అరిజ్ఞర్‌ అన్నా జంతుప్రదర్శనశాల, వెల్లూరు జిల్లాలోని అమిర్థి జంతుప్రదర్శనశాల, సేలం జిల్లాలోని కురుంబపట్టి జంతుప్రదర్శనశాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఉచిత ప్రవేశం పొందాలంటే సందర్శకులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని టికెట్లు తీసుకోవాలి. "ఉచిత ప్రవేశం వల్ల శాఖకు ఆర్థిక నష్టం ఉండదు. ఈ రెండు రోజుల టికెట్ వ్యయం సుమారు రూ.కోటి అవుతుంది. ఆ మొత్తాన్ని నా కుటుంబ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.

భారీ రద్దీ?
వన్యప్రాణి ప్రేమికులు, జంతుప్రదర్శనశాల అధికారులు వండలూరు జంతుప్రదర్శనశాలకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి గరిష్ఠంగా 15,000 మంది మాత్రమే ఈ జంతుప్రదర్శనశాలకు వెళ్లే వీలు ఉంటుంది. అయితే ఉచిత ప్రవేశం వల్ల సందర్శకుల సంఖ్య లక్ష దాటితే జంతువుల సంక్షేమం, ప్రజల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

ఈ ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ముందు జాగ్రత్తగా వండలూరు జంతుప్రదర్శనశాలకు రోజుకు గరిష్ఠంగా 50,000 ఆన్‌లైన్ టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే లోపల ఉన్న సందర్శకుల సంఖ్య ఆధారంగా కౌంటర్ల వద్ద టికెట్ల పంపిణీని నియంత్రిస్తామని చెప్పారు.

గిండి చిల్డ్రన్స్ పార్కుకు మినహాయింపు లేదు
చెన్నైలోని గిండి చిల్డ్రన్స్ పార్కును స్థలాభావం, అధిక రద్దీ కారణంగా ఉచిత ప్రవేశ పథకం నుంచి మినహాయించారు. వండలూరు జంతుప్రదర్శనశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సమీక్షించేందుకు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారి రాకేశ్ కుమార్ దోగ్రా ఆధ్వర్యంలో  ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జూన్ 22న కాంచీపురం జిల్లావ్యాప్తంగా 52,000 మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుందని మంత్రి తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)