ఎన్డీఏ నుంచి వైదొల‌గిన టీఎంసీ(ఎం)

Published on Mon, 06/15/2026 - 14:14

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీ వైదొల‌గింది. ఈ విష‌యాన్ని టీఎంసీ (ఎం) అధ్య‌క్షుడు జీకే వాసన్ ప్ర‌క‌టించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య బాధ్యులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. 12 ఏళ్ల క్రితం స్థాపిత‌మైన త‌మ పార్టీ గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఆయ‌న‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఎన్డీఏలో ప్రాధాన్యత లేదు: నేతల ఆగ్రహం
చైన్నె ఎగ్మోర్‌లో ఆదివారం జీకే వాసన్‌ అధ్యక్షతన టీఎంసీ (ఎం) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జ‌రిగింది. తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మెజారిటీ నాయకులు ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన కనీస ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని, కాబట్టి కూటమి నుండి తక్షణమే వైదొలగాలని జీకే వాసన్‌ను కోరారు. మరికొందరు నేతలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ప్రత్యామ్నాయాల వైపు చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు.

అవకాశవాద రాజకీయాలు పెరిగాయి
నాయకుల అభిప్రాయాలను విన్న అనంతరం జీకే వాసన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న వారు, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఏదో ఒక పార్టీ గుడ్డిగా సాహసం చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన.. వారే ఎల్లకాలం విజయం సాధిస్తారని తాను భావించడం లేదన్నారు.

చ‌దవండి: విజ‌య్ ప్ర‌భుత్వంపై రజినీకాంత్ స‌తీమ‌ణి నో కామెంట్‌

ఒక పార్టీ స్థిరంగా రాణించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు సరైన సంకీర్ణం అవసరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా ఎప్పుడో బలహీనపడిందని, టీఎంసీ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా అంతర్గతంగా కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే ఒక్క ఎన్నికలలోనూ గెలవలేక పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నామ‌ని, అందుకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తామని, బలోపేతం దిశగా వెళ్తామన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)