Breaking News

ముంబై ఉగ్ర దాడులను  ప్రత్యక్షంగా పర్యవేక్షించా 

Published on Mon, 07/07/2025 - 12:38

ముంబై: పదహారేళ్ల క్రితం ముంబైలో పాక్‌ ప్రేరేపిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం వెనక తన పాత్ర ఉందని ఆ దేశానికి చెందిన ఉగ్రవాది తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా అంగీకరించాడు. ఆ క్రమంలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘‘ముంబై దాడుల వెనక పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ హస్తముంది. నేను ముంబైలోనే ఉండి దాడులను పర్యవేక్షించా. పథకం ప్రకారమే ఆనాడు ముంబైలో ఉన్నా.

 భారత్‌లో ఉంటూ పాక్‌కు, ఆ దేశ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేశా’’అని విచారణలో వెల్లడించాడు. కెనడా పౌరసత్వం, పాక్‌ మూలాలున్న రాణాను అమెరికా అరెస్టు చేసి విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. తిహార్‌ జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను తాజాగా ముంబై క్రైం బ్రాంచ్‌ దర్యాప్తు నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈ క్రమంలో అతను పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. 

పక్కాగా లక్ష్యాల ఎంపిక 
తన చిన్ననాటి స్నేహితుడు, ముంబై ఉగ్ర దాడి సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీతో కలిసి పాక్‌లో లష్కరే ఉగ్ర శిక్షణ శిబిరాలకు పలుమార్లు హాజరైనట్టు రాణా వెల్లడించాడు. ‘‘మేమిద్దరం అక్కడ శిక్షణ తీసుకున్నాం. ముంబైలో పాగా వేసేందుకు అక్కడ ఇమిగ్రేషన్‌ కార్యాలయం పెట్టే ఆలోచన నాదే. దాని ముసుగులో పలు ఆర్థిక లావాదేవీలు జరిపా. 

2008 నవంబర్‌ 26న మొదలైన ముంబై దాడుల వేళ నగరంలోనే ఉండి, మా ప్లాన్‌ సక్రమంగా అమలవుతోందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించా. ఎక్కడెక్కడ దాడులు చేయాలి, అందుకు ఏ ప్రాంతాలు అనువైనవి, ఎక్కడైతే ప్రాణనష్టం భారీగా ఉంటుందని అన్నీ బేరీజు వేసుకున్నా. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వేస్టేషన్‌ తదితరాలను దాడులకు ఎంపిక చేసుకున్నాం. అందుకు ఐఎస్‌ఐ సాయపడింది. పాక్‌ సైన్యానికి నమ్మినబంటును గనకే ఖలీజ్‌ యుద్ధం వేళ నన్ను సౌదీ అరేబియాకు పంపారు’’అని చెప్పాడు.

హెడ్లీతో సహవాసం 
‘‘హెడ్లీ, నేను 1974–79 మధ్య హసన్‌ అబ్దల్‌ క్యాడెట్‌ కాలేజీలో కలిసి చదువుకున్నాం. హెడ్లీ తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్‌. సవతి తల్లి పోరు పడలేక తను అమెరికా పారిపోయి కన్నతల్లితో ఉండేవాడు. 2003–04 మధ్య హెడ్లీ, నేను లష్కరే ఉగ్రశిక్షణ తీసుకున్నాం. ఉగ్ర దాడుల కంటే నిఘా కార్యకలాపాల్లో లష్కరేది క్రియాశీల పాత్ర అని హెడ్లీ చెప్పాడు. ముంబైలో నేను తెరిచిన ఇమిగ్రేషన్‌ ఆఫీసు మా ఉగ్ర నిఘా కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది.

 దాన్ని ఓ మహిళ నడిపేది. 2008లో దాడులకు వారం ముందు భారత్‌ వచ్చా. నవంబర్‌ 20, 21 తేదీల్లో ముంబైలోని పోవాయ్‌ ప్రాంతంలో హోటల్లో దిగా. దాడులకు ముందే ముంబై వీడా. దుబాయ్‌ మీదుగా బీజింగ్‌ చేరుకున్నా. పాకిస్తాన్‌ అధికారులు సాజిద్‌ మిర్, అబ్దుల్‌ రహా్మన్‌ పాషా, మేజర్‌ ఇక్బాల్‌ నాకు తెలుసు’’అని రాణా చెప్పాడు. హెడ్లీ తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో భారత్‌ రావడానికి రాణా సాయపడ్డట్టు దర్యాప్తులో తేలింది.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)