Breaking News

కేజ్రీవాల్‌ నివాసానికి స్వాతి మలీవాల్‌.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్?

Published on Fri, 05/17/2024 - 19:29

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి ఘటన  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌ నివాసంలోని డ్రాయింగ్‌ రూంలో సీఎం కోసం  ఆప్‌ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్‌ కుమార్‌ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.

దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్‌ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్‌ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్‌ను రీక్రియెట్‌ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆప్‌ ఎంపీని కేజ్రీవాల్‌ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది.  అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్‌ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.

 

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

దాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్‌కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్‌ నివాసంలో మలీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్‌ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు.  అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్‌ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)