Breaking News

స్వాతి మలివాల్‌ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు

Published on Mon, 06/10/2024 - 14:08

ఢిలీ​: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌కుమార్‌ దాడి చేశారని గత నెలలో ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్‌ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్‌  చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్‌ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం  ఇవ్వటం. బిభవ్‌ కుమార్ ఈ  కేసుకు సంబంధించి ఆధారాలు  మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు   మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బిభవ్‌ కుమార్‌ను దర్యాప్తు చేసిన  పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్‌ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్‌ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో  ఏ ప్రాంతంలో ఫార్మాట్‌ చేశారు?. ఫోన్‌లోని డేటాను ఎవరికి షేర్‌ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్‌ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో  ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని  ఓ పోలీసు అధికారి తెలిపారు.

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్‌ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్‌ అయిన బిభవ్ కుమార్  ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.

మే 13న ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లితే..  అక్కడ కేజ్రీవాల్‌ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్‌.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్‌ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు  చేసింది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)