Breaking News

పరారీలో ‘గలీజు’ బాబా చైతన్యానంద సరస్వతి

Published on Wed, 09/24/2025 - 13:28

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బాబా స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)(Swami Chaitanyananda Saraswati)విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థినులు తమ ఫిర్యాదులో బాబాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి) ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌( Vasant Kunj) ప్రాంతంలో శ్రీ శారద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. గత 12 ఏళ్లుగా ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారంతా ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. అయితే, చైతన్యానంద సరస్వతి తమతో అసభ్య పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు ఆరోపించారు.

విద్యా సంస్థలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 17 మంది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఇక, ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు ఉండే ప్రాంతంతో సహా బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు చేశారు.

ఇది కూడా చదవండి: యూపీలో సరికొత్త అధ్యాయం.. ఉమెన్‌ పోలీసింగ్‌ పవర్‌ ఇది..

కాగా, విద్యార్థినుల ఫిర్యాదు తర్వాత చైతన్యానంద సర్వసతి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, చివరిగా అతడి లొకేషన్‌ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విద్యాసంస్థకు చెందిన బేస్‌మెంట్‌లో ఒక కారు గుర్తించిన పోలీసులు.. దానికి ఉన్నది నకిలీ నంబర్ ప్లేట్ అని వెల్లడించారు. ఇక, ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్‌ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈ తరహా వేధింపుల పైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు