Breaking News

West Bengal: ‘బీహార్‌లా బెంగాల్‌..’ : సువేందు సంచలన డిమాండ్‌

Published on Sun, 08/03/2025 - 12:31

హౌరా (పశ్చిమ బెంగాల్): బీహార్‌లో అమలు చేసిన ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పశ్చిమ బెంగాల్‌లోనూ అమలు చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కోటి మందికిపైగా రోహింగ్యా వలసదారులు,  బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు అక్రమంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. హౌరాలో జరిగిన కన్యా సురక్ష యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తల మధ్య సువేందు అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌ ఓటరు జాబితాలో మరణించిన ఓటర్లు, నకిలీ ఎంట్రీలు, నకిలీ ఓటర్లు, రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు ఉన్నారని, ఓటరు జాబితా విశ్వసనీయతను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం అక్రమ ఓటర్ల పేర్లను తొలగించాలని సువేందు అధికారి డిమాండ్‌ చేశారు.

కాగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. తుది ముసాయిదాలో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. పోల్ బాడీ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24, 2025 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అయితే దానికి భిన్నంగా 7.24 కోట్ల గణన ఫారమ్‌లు (ఈ ఎఫ్‌)లు రావడం విశేషం. బీజేపీ ఆదేశాల మేరకే ఈ కసరత్తు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం వివాదాస్సదంగా మారింది. బీహార్ అసెంబ్లీ, పార్లమెంటులో దీనిపై తీవ్ర నిరసనలు జరిగాయి. కాగా బెంగాల్‌లో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ సువేందు  రాష్ట్రంలో కన్యా సురక్ష యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)