Breaking News

ఢిల్లీలో పవర్‌ ప్లే.. పదవిపై పట్టువీడని ఇద్దరు నేతలు

Published on Tue, 05/16/2023 - 05:01

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్‌ పెద్దలు హస్తినలో మల్లగుల్లాలు పడుతున్నారు. పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ తీవ్రంగా తలపడుతుండటంతో రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడం తెలిసిందే. సీఎల్పీ భేటీలోనూ పీటముడి వీడకపోవడంతో సంప్రదింపుల కోసం వారిద్దరినీ అధిష్టానం హస్తినకు పిలిచింది. దాంతో సిద్ధరామయ్య సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరగా డీకే మాత్రం ‘ఆరోగ్య కారణాల’తో బెంగళూరుకే పరిమితమై మరింత సస్పెన్స్‌కు తెర తీశారు.

ఢిల్లీ వెళ్తున్నట్టు మధ్యాహ్నం దాకా చెబుతూ వచ్చిన ఆయన చివరికి పర్యటనను రద్దు చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంటే ఉన్నారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా, తాను మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకూ నాయకుడినంటూ డీకే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం బెంగళూరులో డీకే 61వ పుట్టినరోజు వేడుకల్లో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. ఆ వెంటనే ఒకరు హస్తినలో, మరొకరు బెంగళూరులో తమ ప్రయత్నాలకు పదును పెడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు.

అసెంబ్లీ పోరులో పార్టీని కలసికట్టుగా విజయ తీరాలకు చేర్చిన వీరిద్దరిలో ఎవరూ పట్టు వీడకపోవడం, వారి మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలు రెండు శిబిరాలుగా చీలిన నేపథ్యంలో ఈ చిక్కుముడిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీలతో చర్చించి మంగళవారం సాయంత్రానికల్లాల సీఎం అభ్యర్థిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని చెబుతున్నారు.

సీఎం అభ్యర్థి ఎంపికకు ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ముగ్గురు అధిష్టానం ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగిన సీఎల్పీ భేటీ ఎటూ తేల్చలేకపోవడం, నేతలతో, ఎమ్మెల్యేలతో దూతల విడివిడి చర్చలు, రహస్య బ్యాలెట్‌ వంటివి ఏ ఫలితమూ ఇవ్వకపోవడంతో అభ్యర్థి ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షునికే కట్టబెడుతూ సీఎల్పీ తీర్మానం చేయడం తెలిసిందే. సీక్రెట్‌ బ్యాలెట్‌ బాక్సులతో ఢిల్లీ ప్రతినిధులు సోమవారం ఢిల్లీ చేరారు. ఖర్గేకు పరిస్థితి వివరించడంతో పాటు నివేదిక కూడా అందజేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)