Breaking News

బీజేపీ సంచలన నిర్ణయం.. కేంద్ర మాజీ మంత్రిపై వేటు

Published on Sat, 11/15/2025 - 16:07

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీహార్‌లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుగుబాటు నేతలపై బీజేపీ దృష్టి సారించింది.

బీహార్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఆర్.కే. సింగ్ సహా ముగ్గురు నేతలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా ముగ్గురు నేతలకు బీజేపీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని నోటీసులో బీజేపీ పేర్కొంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగానే శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఆర్కే సింగ్‌.. మోదీ సర్కార్‌పై విద్యుత్ మంత్రిగా, మాజీ కేంద్ర హోం కార్యదర్శిగా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించారు.

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)