Breaking News

సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్లు.. హై అలర్ట్‌లో భారత సైన్యం

Published on Fri, 01/16/2026 - 08:01

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, డ్రోన్ నిరోధక చర్యలను ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.

ఈ వారంలో సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తొలుత సోమవారం నౌషెరా-రాజౌరీ సెక్టార్‌లో పలు డ్రోన్లు కనిపించడంతో భారత ఆర్మీ అప్రమత్తమై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఆ తర్వాత మంగళవారం రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టార్‌లోనూ డ్రోన్ల కదలికలు కనిపించాయి. మొదటిసారి డ్రోన్లు కనిపించిన వెంటనే భారత్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (DGMOs) మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ తన ఆందోళనను, అభ్యంతరాలను పాక్ అధికారులకు స్పష్టంగా తెలియజేసింది.

వరుస డ్రోన్ ఘటనల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాక్‌ ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో  ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్‌’ ఇంకా కొనసాగుతోందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, గురువారం రాజౌరీ జిల్లాలో భద్రతా దళాలు భారీ ముప్పును తప్పించాయి. అందిన కచ్చితమైన సమాచారం మేరకు కాకోరా గ్రామంలో నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ (ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు