Breaking News

‘సైఫ్‌’ కేసులో అరెస్టుతో జీవితం నాశనమైంది: ఆకాశ్‌

Published on Sun, 01/26/2025 - 19:34

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తొలుత  ఆకాశ్‌ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్‌  కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. 

సైఫ్‌ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్‌  పేర్కొన్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్‌ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియాలో నా ఫొటోలు వేశారు.  ఫొటోలు చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది.

నాకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్‌లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు నాపై దాడి కూడా చేశారు’ అని ఆకాశ్‌ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. 

ఇటీవల సైఫ్‌అలీఖాన్‌పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన దుండగున్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్‌ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకొని వదిలిపెట్టారు. 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)