Breaking News

సుప్రీంకోర్టులో మరోసారి అలజడి

Published on Thu, 07/16/2026 - 06:16

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న మరో దూషణల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీన 13వ నంబర్‌ కోర్టు హాల్లో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సమక్షంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి యూపీలోని ఇటావాకు చెందిన లక్నో యూనివర్సిటీలో మూడో సంవత్సరం లా చదువుతున్న ప్రబల్‌ ప్రతాప్‌ సింగ్‌(24), రాయ్‌బరేలీకి చెందిన సెకండియర్‌ లా విద్యార్థి చందర్‌ భాన్‌(23)లను అరెస్ట్‌ చేశారు. పిటిషనర్‌గా ఉన్న ప్రబల్‌ సింగ్‌ ఓ కేసును స్వయంగా వాదించేందుకు కోర్టు హాలుకు వచ్చాడు. 

ఈ సందర్భంగా చేతిలోని పేపర్లను గాలిలోకి విసిరివేస్తూ, సీజేఐ నుద్దేశించి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. ఇతడికి చందర్‌ భాన్‌ తోడయ్యాడు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో వీరు ఘర్షణ పడ్డారు. దీంతో, కోర్టు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. భద్రతా సిబ్బందిని ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకుని మానసిక వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరికీ ఎలాంటి మానసిక చికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ధారించారు.

 వీరి వద్ద అభ్యంతరకర రాతలున్న కరపత్రాలు లభించాయి. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాలతో పోలీస్‌ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు బుధవారం పూర్తయింది. పోలీసుల వినతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ రవి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్‌కు అనుమతించారు. వారం క్రితం సుప్రీంకోర్టు హాల్లో విచారణ సమయంలో ఓ లాయర్‌ అనుచితంగా వ్యవహరించడం, దూషణలకు దిగడం తెల్సిందే. అయితే, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీజేఐ ప్రకటించారు.  
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)