Breaking News

‘మా వాళ్లు దేశద్రోహులు’: మావోయిస్టుల సంచలన వీడియో

Published on Tue, 11/04/2025 - 12:41

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు మావోయిస్టులు సంచలన వీడియో విడుదల చేశారు. దానిలో లొంగిపోయిన తమ సహచరులను నిందించారు. పార్టీని, ప్రజలను మోసం చేయడం ద్వారా మావోయిస్టుల అంతానికి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని భైరామ్‌గఢ్ ఏరియాకు చెందిన ఇద్దరు క్రియాశీల నక్సలైట్లు అక్టోబర్ 26న పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. నాటి నుండి నక్సలైట్ సంస్థలలో గందరగోళం నెలకొంది. ఇదే నేపధ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయిన తమ సహచరులకు వ్యతిరేకంగా గోండి మాండలికంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో లొంగిపోయిన నక్సలైట్లను దేశద్రోహులుగా అభివర్ణించారు. పార్టీని, ప్రజలను మోసం చేసి, ఇప్పుడు తమపై ఎదురుతిరిగి, తమ జనతా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
 

లొంగిపోయిన మావోయిస్టులు మిగిలిన మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని, తమ స్మారక చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారని, సంస్థను రెండు వర్గాలుగా విభజిస్తూ, మావోయిస్టు భావజాలం ముగింపు గురించి మాట్లాడుతున్నారన్నారు.  భైరామ్‌గఢ్ ప్రాంతంలో చురుకుగా ఉన్న నక్సలైట్ నేత కమలు పూనెం.. పోలీసుల నుంచి రూ. రెండు లక్షలు తీసుకుని లొంగిపోయాడని నక్సలైట్ల వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ ఒక ప్రెస్ నోట్‌లో తెలియజేసింది. పూనెం అక్టోబర్ 26న బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇతను సోను,రూపేష్ బృందానికి చెందినవాడని నక్సలైట్ల పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ తెలిపింది.

ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్‌’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)