Breaking News

దయచేసి వీలునామా రాయండి

Published on Thu, 11/20/2025 - 06:14

న్యూఢిల్లీ: భారతీయ స్త్రీలు తమ స్వార్జితాలను తమ తదనంతరం ఎవరికి చెందాలనే విషయంలో కచ్చితంగా వీలునామా రాస్తే ఆయా ఆస్తులపై భవిష్యత్తులో ఎలాంటి వారసత్వ తగాదాలు రాబోవని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తంచేసింది.

 ఉన్నత విద్యావంతురాలై కష్టపడి పనిచేసే మహిళలు హఠాత్తుగా భర్త, కుమారులు, కుమార్తెలను కోల్పోతే ఆమె ఆస్తులు అత్తింటి వాళ్లకు చెందుతాయా? పుట్టినింటి వాళ్లకు చెందుతాయా? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండేందుకు వీలునామా అనేది చక్కటి పరిష్కారమని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.

 హిందూ వారసత్వ చట్టం, 1956ను అమల్లోకి తెచ్చేనాటికి మన రాజ్యాంగ నిర్మాతలు భారతీయ హిందూ మహిళలు ఒకవేళ పెద్దమొత్తంలో ఆమె పేరిటే ఆస్తిపాస్తులు ఉంటే ఎలా అనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చని అందుకే ఆ నిబంధనలు చట్టంలో లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తుల వారస త్వం విషయంలో  తల్లిదండ్రులు, అత్తా మామల మధ్య మనస్పర్థల నివారణకు ఇకనైనా హిందూ మహిళ వీలునామా బాట పట్టాలని ధర్మాసనం సూచించింది. 

హిందూ మహిళ మరణిస్తే వీలునా మా రాయని పక్షంలో ఆమె పేరిట ఉన్న స్థిరచ రాస్తులన్నీ భర్త తరఫు వారసులకే చెందుతాయంటూ హిందూ వారసత్వచట్టం,1956లోని 15(1) (బి) సెక్షన్‌లో పేర్కొనడాన్ని న్యాయవాది స్నిధా మెహ్రా కోర్టులో సవాల్‌చేయగా ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సెక్షన్‌ రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణాలను ఉల్లంఘించేదిగా ఉందన్న వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 

‘‘ దేశంలోని మహిళలు ముఖ్యంగా హిందు మహిళల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే వీలునామా ఉంటే బాగుంటుందని సూచి స్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘వారసత్వం పోరు రాకుండా ఉండాలంటే సంబంధిత మహిళ చనిపోతే వెంటనే తల్లిదండ్రులు, అత్తామామలు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలి. మ ధ్య వర్తిత్వంతో తీసుకునే నిర్ణయాన్ని కోర్టు తీర్పుగా మేం గౌరవిస్తాం’’ అని కోర్టు హామీ ఇచ్చింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)