Breaking News

కళ్లారా చూస్తూ సమన్యాయం

Published on Thu, 10/17/2024 - 01:57

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కనబెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలనూ తీసేశారు. కళ్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొలువుతీర్చారు. 

సీజేఏ డీవై చంద్రచూడ్‌ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లులేని కబోదికాదని, బ్రిటిష్‌ వలస వాసనలను వదిలించుకుని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని.. రాజులకాలంనాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీవనిత వేషధారణలోకాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుదిరూపునిచ్చారు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)