Breaking News

రైతులను విలన్‌లుగా చూపొద్దు.. పంజాబ్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

Published on Tue, 11/21/2023 - 15:50

ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి రైతులను విలన్‌లుగా చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను వారు కాల్చడానికి చాలా కారణాలు ఉండొచ్చు.. కానీ దానిని అరికట్టడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. ప్రతియేటా శీతాకాలం ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పంట వ్యర‍్థాలపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఇలా స్పందించింది.

'రైతులను విలన్‌లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం వంటి అనేక కారణాలు వారికి ఉండొచ్చు. పంటవ్యర్థాలు కాల్చడాన్ని అరికట్టాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వమే ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా..? పంజాబ్‌లో మొత్తంలో కేవలం 20 శాతం కేసుల్లో మాత్రమే జరిమానా విధించారు. జరిమానాతో పాటు ఎఫ్‌ఐఆర్ వంటి చర్యలను తీసుకోవచ్చు. వరి పెంపకం వల్ల పంజాబ్‌ నేలల్లో తేమశాతం తగ్గిపోతుంది.' అని సుప్రీంకోర్టు మండిపడింది. 

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. గతంతో పోలిస్తే ఈ నవంబరులో దిల్లీ మరింత కాలుష్య నగరంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల కాల్చివేతల ఘటనలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ, యూపీ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)