Breaking News

గోద్రా అల్లర్ల కేసు: తీస్తా షెతల్వాద్‌కు ఊరట

Published on Sun, 07/02/2023 - 05:54

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాద్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశిస్తూ శనివారం గుజరాత్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వారం రోజులపాటు స్టే విధించింది. తొలుత తీస్తా షెతల్వాద్‌కు గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది.

అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారంటూ నమోదైన కేసుపై శనివారం జస్టిస్‌ నిర్జర్‌ దేశాయ్‌ విచారణ జరిపారు.  ఈ కేసులో తనకు సాధారణ బెయిల్‌ మంజూరు చేయాలని విన్నవిస్తూ షెతల్వాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై 30 రోజుల పాటు స్టే ఇవ్వాలన్న షెతల్వాద్‌ తరఫు లాయర్‌ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు.

దీంతో ఆమె వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మొదట ద్విసభ్య వెకేషన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెతల్వాద్‌ విజ్ఞప్తి మేరకు జస్టిస్‌ బీఆర్‌ గావై, జసిŠట్‌స్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తూ హైకోర్టు ఉత్తర్వుపై వారం రోజులపాటు స్టే విధించింది.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు