Breaking News

దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం

Published on Tue, 09/19/2023 - 08:58

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన జెడి-ఎస్‌ ఏకైక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. రేవణ్ణపై ఎన్నికల అనర్హత వేటు వేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.  

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారన్న ఆరోపణలపై జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎంపిక చెల్లదంటూ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడంతో ప్రజ్వల రేవణ్ణకు కొంత ఉపశమనం లభించినట్టైంది. 

వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేవణ్ణను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కెకె  వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించగా, సుప్రీం కోర్టు అందుకు కూడా అనుమతించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు. 

ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం 

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు