సుప్రీంకోర్టు ఆగ్రహం.. మీ పేరు ముందు డాక్టర్‌ను తీసెయ్యండి

Published on Fri, 07/17/2026 - 17:23

సాక్షి,ఢిల్లీ: ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాధితురాలికి ట్రీట్మెంట్‌ చేసేందుకు ఎందుకు నిరాకరించారు. బాధితులు పేదలనే చిన్నచూపా. మీరు ట్రీట్మెంట్‌ చేయకపోవడం వల్లే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మీ పేరు ముందు డాక్టర్‌ అనే పదాన్ని వినియోగించుకునేందుకు కూడా మీరు అనర్హులని సూచించింది.

ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో మార్చి 16న దారుణం జరిగింది. చాక్లెట్‌  కొనిస్తాననే నెపంతో నిందితుడు నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు.ఆపై ప్రాణాలు తీశాడు. అయితే, ఇంటి నుంచి బయటకి వెళ్లిన చిన్నారి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్ని జల్లెడ పట్టారు. 

ఈ క్రమంలో చిన్నారి రక్తస్త్రావానికి గురయ్యారు. దీంతో చిన్నారికి అత్యవసర చికిత్స నిమిత్తం రెండు గంటల పాటు ఖజన్ సింగ్ మాన్వి హెల్త్‌కేర్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అనే రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ, ఆ రెండు ఆసుపత్రులు చిన్నారిని చేర్చుకోవడానికి నిరాకరించాయి. చివరకు ఘాజియాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది.

ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేయకపోగా, బాధితురాలి తల్లిదండ్రులపైనే భౌతిక దాడి చేసి లాకప్‌లో వేశారు. నోరు మూసుకుని ఉండాలని బెదిరించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో మార్చి 17న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో లైంగిక దాడి జరిగినట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, పోలీసులు ప్రారంభంలో పోక్సో చట్టం లేదా అత్యాచారం (సెక్షన్ 376) సెక్షన్లను చేర్చకుండా, కేవలం హత్య కేసుగానే దర్యాప్తు చేశారు. చార్జ్‌షీట్ దాఖలు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేశారు

ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన బెంచ్ నేటి  (జూలై 17) విచారణలో తీవ్రంగా స్పందించింది. ఆసుపత్రి తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.బాధితురాలు పేద కుటుంబానికి చెందినది కావడం వల్లేనా మీరు నిర్లక్ష్యం చేశారు? మీ ఫీజులు కట్టలేరని వదిలేశారా? అని ప్రశ్నించింది.మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించనప్పుడు మీ పేరు ముందు  డాక్టర్ అని రాసుకునే అర్హత లేదు. మీలో కొంచెమైనా మానవత్వం ఉంటే, మీ ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోయినా కనీసం మీరే స్వయంగా ఆ చిన్నారిని వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేవారుఅని ధ్వజమెత్తింది.

ఆసుపత్రి, అక్కడ పనిచేసిన ఆయుర్వేద డాక్టర్ ప్రవర్తన అత్యంత కఠినమైన మనసుగా అభివర్ణించింది. ఈ దారుణానికి ప్రాయశ్చిత్తంగా బాధితురాలి కుటుంబానికి ఆయా ఆసుపత్రులు స్వచ్ఛందంగా భారీ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ద్వారా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

కేసులో తీవ్రమైన లోపాలను గుర్తించిన సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు అంతా కోర్టు పర్యవేక్షణలోనే జరుగుతోంది. బాధితురాలి కుటుంబానికి,సాక్షులకు ఎలాంటి బెదిరింపులు రాకుండా పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)