Breaking News

మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Published on Fri, 10/25/2024 - 16:47

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో తనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే  ఇవ్వాలని మధుకోడా సుప్రీం తలుపు తట్టారు. స్టే ఇస్తే తాను ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హున్నవుతానని కోర్టు దృష్టికి  తీసుకువచ్చారు.

కోడా పిటిషన్‌ను శుక్రవారం(అక్టోబర్‌ 25) విచారించిన జస్టిస్‌ సంజీవ్‌కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా బెంచ్‌ ‌ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడాకు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో తాము  బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ విషయంలో ఇచ్చిన ఊరట మధుకోడాకు ఇవ్వలేమని తెలిపింది. 

అన్సారీ సిట్టింగ్‌ ఎంపీ అయినందువల్లే ఆయనకు పడిన శిక్షపై స్టే ఇచ్చామని పేర్కొంది. ఇవే తరహా స్టేలు రొటీన్‌గా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మధుకోడాకు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్‌ లేకుండాపోయింది. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ ఏళ్లు శిక్ష పడిన  ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలు రద్దవడంతో పాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల దాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోతారు.

ఇదీ చదవండి: వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా..


 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)