Breaking News

దలేవాల్‌ బతికుండాలా? చనిపోవాలా? 

Published on Sun, 12/29/2024 - 06:16

న్యూఢిల్లీ:  రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్‌–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్‌ రైతు సంఘం నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దలేవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్‌కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. 

దలేవాల్‌ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్‌కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్‌ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ గురీ్మందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. 

దీక్షలో ఉన్న దలేవాల్‌ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్‌ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. 

చికిత్స తీసుకోవడానికి దలేవాల్‌ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్‌ సింగ్‌ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్‌ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్‌ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్‌ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది.  

సెలవు రోజునా ప్రత్యేక విచారణ  
సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్‌ సింగ్‌ దలేవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. 
 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు