Breaking News

కర్తవ్యం మరచి కథలు చెబుతున్నారా?: సుప్రీం సీరియస్‌

Published on Thu, 01/29/2026 - 06:55

న్యూఢిల్లీ: వీధి శునకాల సంతతి వృద్ధిని కట్టడిచేసే లక్ష్యంతో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ తాము గతంలో ఇచ్చిన తీర్పును చాలా రాష్ట్రాలు గాలికొదిలేశాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సహాయకులుగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రాలు ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నాయో జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనానికి నివేదించారు.

ఈ సందర్భంగా ‘జంతువుల జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వీధి శునకాలకు కు.ని. ఆపరేషన్లు చేయాలని సూచించారు. వాటికి షెల్టర్లను నిర్మించాలని ఆదేశించారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోకి వీధికుక్కలు రాకుండా కంచెలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇవేమీ రాష్ట్రాలు సరిగా అమలుచేయట్లేదు’’ అని గౌరవ్‌ వెల్లడించారు. రాష్ట్రాల నిర్లక్ష్య వైఖరిపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.

మేం ఇచ్చిన తీర్పును అమలుచేసే కర్తవ్యాన్ని రాష్ట్రాలు గాలికొదిలేసి గాల్లో కోటలు కడుతున్నాయి. కథలు చెబుతున్నాయి. అస్సాం మినహా ఏ రాష్ట్రం కూడా కుక్కకాటు ఘటనలు ఎన్ని జరిగాయో నమోదుచేయలేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను గురువారం కోర్టుకు నివేదిస్తానని గౌరవ్‌ అగర్వాల్‌ చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)