Breaking News

మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్‌

Published on Sat, 04/19/2025 - 07:22

న్యూఢిల్లీ: శిక్షా కాలం సగం ముగిశాక శిక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామంటూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఓ వ్యక్తి పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎటువంటి ప్రాతిపదిక లేని కొట్ట చట్టాన్ని హైకోర్టు కనిపెట్టడం మాకు ఆశ్చర్యం కలిగించింది’ అని వ్యాఖ్యానించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున తీర్పును సవాల్‌ చేస్తూ వేసే అప్పీల్‌పై సమీప భవిష్యత్తులో వాదనలు వినే అవకాశాలు లేవు కాబట్టి బెయిల్‌ ఇవ్వవచ్చని ఈనెల 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. చట్టాలను యథాతథంగా అమలు చేయాలని, బెయిల్‌ కోసం పిటిషనర్లు తమ దాకా వచ్చేలా చేయరాదని పేర్కొంది.

కాగా, హైకోర్టు ఏం చెప్పిందంటే.. ‘తన వద్ద పట్టుబడిన నకిలీ నోట్ల గురించి పిటిషనర్‌ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అందుకే, శిక్ష నిలిపివేత, బెయిల్‌ మంజూరుకు తగు ప్రాతిపదిక లేదు. మొదటి దరఖాస్తును తిరస్కరించిన రెండు నెలల లోపలే బెయిల్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. అందుకే, సగం శిక్షా కాలం పూర్తయ్యాక మరోసారి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని పేర్కొంది. సాధారణ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు బెయిల్‌ తిరస్కరించ వద్దని గతంలో ట్రయల్‌ కోర్టును, హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి