Breaking News

ఆలయం సొమ్మును ఆ దేవత కోసమే వినియోగించాలి: సుప్రీం

Published on Sat, 12/06/2025 - 07:28

న్యూఢిల్లీ: ఆలయానికి చెందిన సొమ్మును ఆ దేవత కోసం వాడాలే తప్ప, కష్టాల్లో ఉన్న సహకార బ్యాంకుల కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చింది. తిరునెల్లి టెంపుల్‌ దేవస్వోమ్‌కు చెందిన డిపాజిట్లను తిరిగి ఆలయానికి వాపసు చేయాలంటూ కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా ధర్మాసనం..‘బ్యాంకులను కాపాడుకునేందుకు మీరు ఆలయం సొమ్మును వాడుకోవాలనుకుంటున్నారా? నష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో ఆలయం డబ్బును ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు మళ్లించాలని ఆదేశించడంలో తప్పేముంది?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ‘ఆలయం సొమ్ము ఆ దేవతకే చెందుతుంది. అందుకే, ఆ సొత్తును దాచాలి, కాపాడుకోవాలి, ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. అంతేగానీ, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకు మనుగడకు ఒక వనరుగా ఆ సొమ్ము మారరాదు’అని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. 

బ్యాంకులు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలన్న ధర్మాసనం.. ఖాతాదారులను, డిపాజిట్లను ఆకర్షించలేకపోవడం మీ సమస్య’అని పిటిషనర్లనుద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. అయితే, డిపాజిట్ల ఉపసంహరణ గడువు పెంచాలని కేరళ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆలయానికి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొన్ని సహకార బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో తిరునెల్లి ఆలయ బోర్డు కోర్టుకెక్కింది.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి