Breaking News

కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోం

Published on Fri, 09/27/2024 - 03:49

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బానో రేప్, కుటుంబసభ్యుల హత్య కేసు దోషుల మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు(రెమిషన్‌) చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ గత తీర్పులో తాము చేసిన పరుష వ్యాఖ్యలను తొలగించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. కోర్టు వ్యాఖ్యానాల తొలగింపు అంశాన్ని పునర్‌సమీక్షించాలంటూ గుజరాత్‌ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ రివ్యూ పిటిషన్‌లో ఎలాంటి పస లేదు.

 గతంలో తీర్పు సందర్భంగా మేం చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ కోణంలో గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. దోషులు రెమిషన్‌పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్‌కు ఉంటుందని 2022 మేలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్‌ చెప్పడంతోనే తాము తుది నిర్ణయం తీసుకున్నామని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది. 

అయితే మహారాష్ట్రలోని సీబీఐ కోర్టులో కేసు విచారణ జరిగినందున రెమిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని గుజరాత్‌ బలవంతంగా లాక్కుందని, తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెల్సిందే. 11 మంది దోషుల రెమిషన్‌ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గోధ్రాలో రైలు దహనం ఉదంతం తర్వాత 2002లో గుజరాత్‌లో ముస్లింలపై దాడుల సందర్భంగా ఐదునెలల గర్భిణి అయిన బిల్కిస్‌ బానోను రేప్‌ చేసి, ఆమె మూడు నెలల కూతురుసహా ఏడుగురు కుటుంబసభ్యులను ఈ 11 మంది చంపేయడం తెల్సిందే.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)