Breaking News

విచారణకు ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలు కావాలా?

Published on Fri, 07/24/2026 - 09:51

సాక్షి, న్యూఢిల్లీ: విచారణ పేరుతో వేరే దేశాల్లోలాగా ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కావాలా అని విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయి­కృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సీఐ నాగరాజు పోలీసు కస్టడీకి హైకోర్టు విధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురు­వారం విచారించింది. కింది కోర్టులు విధించిన నిబంధనల వల్ల పోలీసు కస్టడీ లక్ష్యం నెరవేరడం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. 

నిందితుడిని విచారణకు రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు రానుపోను ఆరు గంటల సమయం పడుతోందని, విచారణకు సమయం ఎక్కడ ఉంటుందని అన్నారు. సీఐ నాగరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ జైలులో ఉన్న పలువురి అరెస్టుకు ఆ పోలీస్‌ అధికారి కారణమైనందున, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతోనే హైకోర్టు ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మార్చిందని తెలి­పారు. 

ఈ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, ఏసీ రూమ్‌లు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటి?’ అని నాగరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇక్కడ సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్‌ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. పోలీస్‌ విచారణ చట్టబద్ధమైన పద్ధతుల్లో, కోర్టు మార్గదర్శకాలకు లోబడి మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. జూన్‌ 23న అరెస్ట్‌ జరిగినందున చట్టప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని తేల్చిచెబుతూ «తీర్పును రిజర్వ్‌ చేసింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)