Breaking News

డిఫాల్ట్‌ బెయిల్‌ పొందడం నిందితుడి హక్కు

Published on Thu, 03/21/2024 - 06:34

న్యూఢిల్లీ:  కేసులో విచారణ ప్రారంభించకుండా నిందితుడిని కస్టడీలో సుదీర్ఘకాలం ఎలా కొనసాగిస్తారని ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నిందితుడి స్వేచ్ఛను హరించడమే అవుతుందని తేలి్చచెప్పింది. అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేస్తూ నిందితులకు డిఫాల్ట్‌ బెయిల్‌ లభించకుండా చేయడం సమంజసం కాదని పేర్కొంది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అనుచరుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ నివాసంలో 2022 ఆగస్టులో ఈడీ సోదాలు చేసింది.

రెండు ఏకే–47 తుపాకులు, 60 బల్లెట్లు లభించాయి. దీంతో అతడిపై ఆయుధాల చట్టంతోపాటు మనీ లాండరింగ్‌ నేరం కింద ఈడీ కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి నిందితుడి ఈడీ కస్టడీలోనే ఉంటున్నాడు. అతడికి బెయిల్‌ లభించకుండా ఈడీ ఇప్పటిదాకా కోర్టులో నాలుగు అనుబంధ చార్జిïÙట్లు దాఖలు చేసింది. తనకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ప్రేమ్‌ప్రకాశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. డిఫాల్ట్‌ బెయిల్‌ పొందడం నిందితుడి హక్కు అని స్పష్టం చేసింది. అతడిని ఎందుకు కస్టడీలో కొనసాగిస్తున్నారనో చెప్పాలని ఈడీని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్‌ 29కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పషీ్టకరణ 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)