Breaking News

దివ్యాంగులపై జోకులా.. కమెడియన్లకు సుప్రీంకోర్టు బిగ్‌ షాక్

Published on Mon, 08/25/2025 - 13:17

ఢిల్లీ: దివ్యాంగులపై జోకులు వేసే కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్టాండప్‌ కామెడీ పేరుతో దివ్యాంగులపై అనుచితమైన జోక్స్‌ తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవమానించే వ్యాఖ్యలు ఎప్పుడు ఆగుతాయంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అసభ్యకరమైన జోకులు వేసిన కమెడియన్లను మందలించింది. ఇలాంటి షోల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేసినవారు తమ సామాజిక మాధ్యమాల్లో కూడా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సామేయ్ రైనా, విపున్ గోయల్, బల్ రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వంటి కమెడియన్లు వికలాంగులను అపహాస్యం చేశారంటూ ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హాస్యం జీవితంలో భాగమే, కానీ అది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయకూడదంటూ ధర్మాసనం హెచ్చరించింది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించింది. ఇలాంటి కేసులలో భవిష్యత్తులో జరిమానాలు కూడా విధించవచ్చంటూ సుప్రీంకోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై కమెడియన్లు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం.. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లపై విధించాల్సిన జరిమానాపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వివాదం అనంతరం సమయ్ రైనా తన షో "ఇండియాస్ గాట్ లాటెంట్"ను నిలిపేసిన సంగతి తెలిసిందే.

జోకులపై సుప్రీం కోర్ట్ సీరియస్

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)