Breaking News

న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ

Published on Thu, 06/19/2025 - 14:58

సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్‌ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

 ఈ ఏడాది  మార్చి నెలలో జస్టిస్‌ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన  రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్‌లో జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్‌ చేశాయి.    

సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య  కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది.  

IMG-1

నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.

పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్‌లో ఉన్న స్టో రూమ్‌లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ అధికారిక నివాసం…” 

పేజీ 59లో: “... స్టోరుమ్‌లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”

మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వ‌చ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు  చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని స‌ద‌రు వ్యక్తి త్రిస‌భ్య క‌మిటీకి చెప్పారు. 

కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్ద‌మొత్తంలో స్టోరూంలో ల‌భ్య‌మ‌వ్వ‌డంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదిక‌లో ప్ర‌స్తావించింది.

జస్టిస్‌ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా క‌మిటీ విచారించింది. విచార‌ణ‌లో  ఈ ఇద్దరూ స్టోరూంలో న‌గ‌దు ఉన్న విష‌యాన్ని  ఎవ‌రికీ చెప్పొద్ద‌ని అగ్నిమాపక సిబ్బందిని కోరిన‌ట్లు తేలింది.

దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.

IMG-2

దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో  జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది.  ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు జస్టిస్‌ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు.  

సుప్రీం నియ‌మించిన త్రిస‌భ్య క‌మిటీ స‌భ్యులు 
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ షీల్‌ నాగ్, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనూ శివరామన్‌ను సభ్యులుగా ఉన్నారు.  

 

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)