Breaking News

‘డిజిటల్‌ అరెస్ట్‌’ దర్యాప్తు సీబీఐకి

Published on Mon, 12/01/2025 - 15:04

సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్‌ అరెస్టుల పేరుతో ప్రజలను మోసగించి, నిలువు దోపిడీ చేస్తున్న కేసులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నందున వీటన్నిటిపైనా ఏకీకృత దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ కుంభకోణం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సీబీఐకి స్పష్టం చేసింది. 

ఈ విషయంలో రాష్ట్రాలు సీబీఐకి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాధికారులు, పోలీసులు, దర్యాప్తు విభాగాల పేరు చెప్పుకుని సైబర్‌ నేరగాళ్లు వీడియో, ఆడియో కాల్స్‌ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి, డబ్బులు వసూలు చేస్తున్న కేసులు పెరిగిపోతుండటంపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగి్చల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ కేసుల దర్యాప్తు విషయంలో బీజేపీయేతర పాలిత తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కర్నాటక సహా అన్ని రాష్ట్రాలు సీబీఐకి సహకారం అందించాలని కోరింది. అదే సమయంలో, కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు అక్కౌంట్లను ఎందుకు ఫ్రీజ్‌ చేయలేకపోతోందంటూ ఆర్‌బీఐని ప్రశ్నించింది. సమాధానమివ్వాలంటూ నోటీసు జారీ చేసింది. 

హరియాణాకు చెందిన వృద్ధ దంపతులు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పలు ఆదేశాలను వెలువరించింది. డిజిటల్‌ అరెస్ట్‌ కేసులపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన వివరాలను అందించాలని సంబంధింత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వేదికలను కోరింది. ఇతర దేశాల్లో ఉంటూ ఈ దందా సాగిస్తున్న సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఇంటర్‌పోల్‌ సాయం కూడా తీసుకోవాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.

 టెలికం సరీ్వస్‌ ప్రొవైడర్లు ఒక వ్యక్తి లేదా సంస్థకు లెక్కకు మిక్కిలి సిమ్‌ కార్డులు జారీ చేయకుండా చూడాలని కేంద్ర టెలికం శాఖను కోరింది. సైబర్‌ నేరగాళ్లకు ఇటువంటి వాటిని అవకాశంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఇటువంటి నేరాలపై సమన్వయంతో వ్యవహరించేందుకు ప్రాంతీయ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

 హోం, టెలికం, ఆర్థిక, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలు సైబర్‌ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను తమ ముందుంచాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. మోసగాళ్ల బ్యాంకు ఖాతాలను స్తంభింప జేయాలని స్పష్టం చేసింది. నేరగాళ్ల ముఠాలతో చేతులు కలుపుతున్న బ్యాంకు అధికారుల గుట్టును కనిపెట్టాలంది. తదుపరి విచారణ నాటికి టెలికాం శాఖ అధికారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.  

డిజిటల్ అరెస్టుల కేసుల్లో సీబీఐ దర్యాప్తు

ఇదీ చదవండి: ఆ ఆవు నెయ్యిలో నాణ్యత లేదు.. పతంజలికి షాక్‌

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)