Breaking News

స్వదేశానికి రండి

Published on Fri, 05/30/2025 - 01:34

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావును భారతదేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వు లు వచ్చే వరకు ప్రభాకర్‌రావుపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని దర్యాప్తు బృందానికి సూచించింది. పాస్‌పోర్టు రద్దు కా రణంగా ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి రా లేని పరిస్థితుల్లో ఆయనను పారిపోయిన వ్యక్తి గా పరిగణించలేరని స్పష్టం చేసింది. 

పాస్‌ పోర్టు లేదా ప్రయాణ పత్రం అందిన 3 రోజు ల్లోపు దేశానికి తిరిగి వస్తాననే హామీ పత్రం ఇవ్వాలని ప్రభాకర్‌రావుకు సూచించింది. ఈ ఆదేశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన దర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదించారు. 

పాస్‌పోర్టు పునరుద్ధరిస్తే వస్తారు 
ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించిన ప్రభాకర్‌రావుపై తప్పు డు కేసులు పెట్టారని శేషాద్రినాయుడు చెప్పా రు. ఎఫ్‌ఐఆర్‌ సమయంలో ఆయన అమెరికా వెళ్లారని, దీంతో ఆయన్ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి పాస్‌పోర్టును రద్దు చేశారని తెలిపారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చేందుకు అవకాశం లేకుండా పాస్‌పోర్టును రద్దు చేశారని తెలిపారు. పాస్‌పోర్టు పునరుద్ధరిస్తే భారత్‌కు తిరిగి వస్తారని, విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి బెయిల్‌ ఇచ్చారన్నారు.   

మధ్యంతర రక్షణ ఇవ్వొద్దు : తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహా రం చాలా తీవ్రమైనదని, ప్రభాకర్‌రావుకు ఎటువంటి మధ్యంతర రక్షణ ఇవ్వరాదని అన్నారు. ఆయన పరారీలో ఉన్నందున ముందస్తు బెయిల్‌ను రాష్ట్ర ప్రభు త్వం వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభాకర్‌రావు పరారీలో ఉన్నట్లుగా ప్రకటి స్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని తెలి పారు.

ముందస్తు బెయిల్‌ కాకుండా రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించగా.. పిటిషనర్‌ తిరిగి వస్తే ఆయనను అరెస్టు చేయబోమని ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించా రు. లేదని, ప్రభాకర్‌రావును అరెస్టు చేయాలని అనుకుంటున్నట్లు తుషార్‌ మెహతా చెప్పారు. కేసు దర్యాప్తు అధికారి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకున్నారు. 

‘ఆయన భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితుల్లో ప్రభాకర్‌రావు చట్టానికి దూరంగా ఉన్నట్టు మీరు చెప్పలేరు. ఆయన పారిపోయిన వ్యక్తి కాదు’అని అన్నారు. వాదనల అనంతరం ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలుగా ఆయన పాస్‌ పోర్టును పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందానికి తెలిపింది. దేశానికి వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)