ఆప్‌ హెడాఫీస్‌ ఖాళీకి డెడ్‌లైన్‌ విధించిన సుప్రీం

Published on Mon, 03/04/2024 - 16:36

న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు జూన్ 15 వరకు గడువు విధించింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు అధికార పార్టీకి కోర్టు సుధీర్ఘ గడువు ఇచ్చింది.

అయితే ఢిల్లీ జిల్లా కోర్టును విస్తరించే నిమిత్తం ఈ స్థలాన్ని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన నేపథ్యంలో ఆప్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ప్రదేశంలో కొనసాగే హక్కు ఆప్‌కు లేదని పేర్కొంది. పార్టీ కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినించింది.

ఈ అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేసి.. తదుపరి నిర్ణయాన్ని నాలుగు వారాల్లో తమకు తెలియజేయాలని ల్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాన్ని కోరింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం: కేజ్రీవాల్‌ వర్చువల్‌ విచారణపై ఈడీ స్పందన

Videos

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)