Breaking News

మీడియా ముందు పోలీసులేం మాట్లాడాలో నిర్ణయించండి 

Published on Thu, 01/22/2026 - 05:52

న్యూఢిల్లీ: విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రజలు, మీడియా సమక్షంలో పోలీసులు ఏ మేరకు ప్రస్తావించాలో, ఏ అంశాలను మాత్రమే వెల్లడించాలో తెలిపే నియమావళిని రూపొందించాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత మూడు నెలల్లోపు ఈ మేరకు నిబంధనావళిని తయారుచేయాలని జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం సూచించింది. 

ఈ మేరకు జనవరి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులోని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న, విచారణ దశలో ఉన్న కేసులపై మీడియా ఎదుట పోలీసులు కీలక విషయాలతోపాటు అనవసర విషయాలనూ ప్రస్తావిస్తున్నారని, ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కోర్టు సూచనలుచేసింది.

 ‘‘కోర్టుకు సహాయకుడు(అమికస్‌ క్యూరీ)గా వ్యవహరించిన సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ కేంద్ర ప్రభుత్వం, విదేశాలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ‘పోలీస్‌ మాన్యువల్‌ ఫర్‌ మీడియా బ్రీఫింగ్‌’ను తయారుచేశారు. దీనిని మీరు ఒకసారి పరిశీలించండి. బాగుంటే దీనిని మీరూ అనుసరించండి. లేదంటే కొత్తగా మరోటి తయారుచేసుకోండి. కొత్త మాన్యువల్‌ను ఆ తర్వాత రెండు వారాల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయండి’’అని కోర్టు ఆదేశించింది. శంకరనారాయణన్‌ తయారుచేసిన ఈ 60 పేజీల మాన్యువల్‌లో నాలుగు భాగాలున్నాయి. దర్యాప్తుకు ఎలాంటి భంగం కల్గించకుండా, నష్టం వాటిల్లకుండా, కీలక అంశాలు బయటకు పొక్కకుండా, క్లుప్తంగా విషయాలను మీడియాకు పోలీసులు చెప్పొచ్చని మాన్యువల్‌ పేర్కొంది.   
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)