Breaking News

కన్వర్ యాత్ర: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్‌

Published on Mon, 07/22/2024 - 14:12

కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించింది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.

యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను రాయాలని తొలుత ఆదేశించింది. తరువాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వీటిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. విచారణలో ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని కోరింది. దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.

దీనికిముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని, మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నదని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలు  ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ మాట్లాడుతూ పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని అన్నారు.

విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లో జారీ చేసిన నేమ్‌ ప్లేట్‌లకు సంబంధించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్టే విధించింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు