Breaking News

టైగర్‌ రిజర్వుల చుట్టూ ఈఎస్‌జెడ్‌లు 

Published on Tue, 11/18/2025 - 06:38

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టైగర్‌ రిజర్వుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. టైగర్‌ రిజర్వుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సున్నిత పర్యావరణ జోన్లు(ఈఎస్‌జెడ్‌)లుగా ప్రకటించాలని, బఫర్‌ జోన్‌లలో కిలోమీటర్‌ పరిధిలో మైనింగ్‌ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.ఏడాదిలోగా వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. జిమ్‌ కార్బెట్‌ టైగర్‌ రిజర్వులో అక్రమంగా చెట్ల నరికివేత, నిర్మాణ పనుల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఉత్తరఖాండ్‌ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సారథ్యంలోని ధర్మాసనం 80 పేజీల తీర్పు వెలువరించింది.  

జిమ్‌ కార్బెట్‌కు తీవ్ర నష్టం  
టైగర్‌ రిజర్వుల్లో పర్యావరణ ఉల్లంఘనలు, నష్టం తీవ్రత, పునరుద్ధరణ చర్యలతోపాటు ప్రఖ్యాత జిమ్‌ కార్బెట్‌ టైగర్‌ రిజర్వులో జరిగిన విధ్వంసానికి బాధ్యులైన అధికారుల గుర్తింపు తదితరాలపై 2024 మార్చిలో నియమించిన నిపుణుల కమిటీ తాజాగా ఇచి్చన నివేదికను ధర్మాసనం ఆమోదించింది.కార్బెట్‌ టైగర్‌ రిజర్వులో సుమారు రూ.30 కోట్ల మేర విధ్వంసం జరిగినట్లు కమిటీ అంచనా వేసిందని ధర్మాసనం పేర్కొంది. 

దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకు రూ.4.3 కోట్ల వరకు ఖర్చవుతుందని తేలి్చనట్లు కూడా ధర్మాసనం తెలిపింది. ఈ నివేదిక సూచనల మేరకు జిమ్‌కార్బెట్‌ టైగర్‌ రిజర్వు పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై రెండు నెలల్లోగా ఒక ప్రణాళికను రూపొందించాలని ఉత్తరాఖండ్‌ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ను ధర్మాసనం ఆదేశించింది. నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్న అనధికారి నిర్మాణాలను మూడు నెలల్లోగా కూల్చి వేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ తీర్పు మేరకు అమలు చేసిన చర్యలతో ఏడాదిలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలంది.  

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)