Breaking News

నీట్‌ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా

Published on Mon, 07/22/2024 - 08:36

ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిష్లున్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

విచారణ సందర్భంగా పరీక్ష సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో కూడా గందరగోళం ఉందన్న పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థి గుజరాత్‌ నుంచి బెల్గావి వెళ్లి పరీక్ష రాస్తే.. 700పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఎన్టీఏ నుంచి బ్యాంక్‌ లాకర్లకు పేపర్లు చేరడానికి మధ్యలో ఏదో జరిగిందని తెలిపారు.

విచారణ సందర్భంగా.. ఫిజిక్స్‌ పేపర్‌లోని 19వ ప్రశ్నకు రెండు ఆప్షన్‌లు సరైనవిగా ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొందని, కొత్త ఎన్‌సీఈఆర్‌టీ ఎడిషన్ ప్రకారం, ఆప్షన్‌ 4 సరైన సమాధానం అని ఉంటే, మునుపటి ఎడిషన్ల ప్రకారం ఆప్షన్‌ 2 సరైనదిగా పేర్కొన్న విద్యార్థులకు కూడా షనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు కలిపిందని పిటిషనర్ తన న్యాయవాది ద్వారాకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనికిసీజేఐ బదులిస్తూ.. తాజా ఎన్‌సీఈఆర్‌టీ ఎడిషన్‌లోని సూచనలే పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆప్షన్‌కు సమాధానం ఇచ్చిన వారికి పూర్తి మార్కులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎందుకు ఎన్టీయే అలా చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అయితే రెండూ సాధ్యమయ్యే సమాధానాలేనని ఎస్జీ బదులిచ్చారు.అయితే ఇది సరైనది కాదని, ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంపిక చేయాలని, రెండూ సరైన సమాధానాలు కాలేవని సీజేఐ పేర్కొన్నారు

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని డీవై చంద్రచూడ్‌ తెలిపారు. "సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఐఐటీT ఢిల్లీ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిపుణుల బృందం సరైన ఆప్షన్‌పై   అభిప్రాయాన్ని రూపొందించి, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజిస్ట్రార్‌కు  తెలియజేయవలసిందిగా ఆదేశించారు. 

మరోవైపు.. నీట్‌ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేం‍ద్రం పేర్కొంది. ఇరు వర్గాల సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రేపటికి(మంగళావారం) వాయిదా వేసింది.

ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే.  పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపుతోంది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)