బాబా ఆశారాంకు మధ్యంతర బెయిల్

Published on Tue, 01/07/2025 - 16:26

న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబా ఆశారాం(Asaram Bapu)నకు మధ్యంతర బెయిల్‌ లభించింది. సుప్రీంకోర్టు(Supreme court) ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్‌(Interim Bail) ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్‌ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు. 

బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్‌ ఇవ్వాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించ వద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గుజరాత్‌ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు. 

అనంతరం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోధ్‌పూర్‌లోని మరో ఆశ్రమంలో  16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు.ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో ఆశారం ఒకేసారి శిక్ష అనుభవిస్తున్నారు.

ఇదీ చదవండి: 16 ఏళ్లకే ఇంటిని వదిలి..తాళాల బాబా సాధన ఇదే

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)