Breaking News

సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

Published on Fri, 05/19/2023 - 13:02

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయవాది కల్పతి వెంకటరమణ్‌ విశ్వనాథన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇద్దరు న్యాయమూర్తులతో సీజేఐ డీవై చంద్రచూడ్‌ శుక్రవారం ప్రయాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశారు. 

ఇటీవల జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎంఆర్‌ షా పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 32కు పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. ప్రస్తుతం సుప్రీంలో సీజేఐతో సహా 34 మంది జడ్జీలు ఉన్నారు.  అయితే వీరిలో మరో ముగ్గురు న్యాయమూర్తులు.. జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వి రామసుబ్రమణియన్ వేసవి సెలవుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మళ్లీ సంఖ్య తగ్గిపోనుంది.
చదవండి: పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు

కాగా జస్టిస్‌ మిశ్రా, విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నూతన మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే ఈ నియామకాలు జరిగాయి. ఇదిలా ఉండగా సీనియారిటీ ప్రకారం 2030లో జస్టిస్‌ వెంకటరమణ్‌ విశ్వనాథన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.మే 16 కొలిజియం సాఫార్సు చేసింది. 
చదవండి: ‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)