Breaking News

టోల్‌ వసూలు దేనికి? ప్రాణాలు తీయడానికా?: సుప్రీం

Published on Tue, 11/11/2025 - 05:30

సాక్షి, న్యూఢిల్లీ: ’టోల్‌ ట్యాక్స్‌ వసూలు దేనికి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటానికా?’అంటూ జాతీయ రహదారుల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారులపై పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ ధాబాలు, గుంతలమయంగా మారిన రోడ్ల వల్ల రెండు రోజుల్లో 40 మంది మరణించడంపై భగ్గుమంది. ‘ఇది అసమర్థతకు పరాకాష్ట.. భరించలేని దారుణం’అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. 

ఈ రోడ్డు ప్రమాదాలపై సుమోటోగా కేసు నమోదు చేసిన న్యాయస్థానం.. ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండు వారాల్లోగా సమగ్ర నివేదికలతో తేల్చాలని అల్టిమేటం జారీ చేసింది. జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ’రెండు రోజుల్లో రెండు భయంకరమైన ప్రమాదాలు.. 40 మంది చనిపోయారు. ఇది చాలా ఎక్కువ’అని జస్టిస్‌ మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ హైవే ప్రమాదానికి గుంతలే కారణం 
నవంబర్‌ 3న హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 163)పై 20 మందిని బలిగొన్న ప్రమాదంపై ధర్మాసనం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ‘పత్రికా కథనాల ప్రకారం, హైవేపై ఉన్న ఓ పెద్ద గుంతను తప్పించే ప్రయత్నంలోనే లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఇది వ్యవస్థ వైఫల్యం కాదా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. 

’ప్రజల నుంచి టోల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు, కానీ రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దెబ్బతిన్న, అసమానంగా ఉన్న రోడ్లపైనే ప్రయాణం సాగుతోంది. ఇది ఆమోదయోగ్యం కాదు’అని జస్టిస్‌ మహేశ్వరి తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పరిధిలోని ఆ హైవేపై భద్రతా ప్రమాణాలు, కాంట్రాక్టర్ల పనితీరుపై తక్షణం ఆరా తీయాలని ఆదేశించారు. 

యమపాశాలవుతున్న అక్రమ ధాబాలు 
రాజస్తాన్‌లోని ఫలోడి వద్ద 18 మంది మృతికి అక్రమ ధాబాలే కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘హైవేల పక్కన, నోటిఫై చేయని ప్రాంతాల్లో ఈ అక్రమ ధాబాలు వెలుస్తున్నాయి. ట్రక్కులను ప్రమాదకర రీతిలో రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. దీనిని ఎలా నియంత్రిస్తారు?’అని ధర్మాసనం నిలదీసింది. 

రెండు ప్రమాదాల్లోనూ రోడ్డు రూపకల్పనలో లోపాలు, సూచిక బోర్డులు లేకపోవడం, లైటింగ్‌ సరిగా లేకపోవడం వంటి అంశాలు వ్యవస్థాగత లోపాలను స్పష్టంగా సూచిస్తున్నాయని పేర్కొంది. ఈ కేసులో సమన్వయం కోసం కేంద్ర హోం శాఖను ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ప్రమాదాలు జరిగిన రెండు హైవేలు సాగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకూ నోటీసులు జారీ చేసింది. 

రెండు హైవేలపై ఉన్న అక్రమ ధాబాల జాబితా, రోడ్ల వాస్తవ పరిస్థితి, కాంట్రాక్టర్ల నిర్వహణ నిబంధనలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర రోడ్డు రవాణా శాఖను ఆదేశించింది. రోడ్డు భద్రత అంశంపై కోర్టుకు సహకరించేందుకు సీనియర్‌ న్యాయవాది ఏఎన్‌ఎస్‌ నడ్కర్ణిని అమికస్‌ క్యూరీగా నియమించింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)