Breaking News

ఆ ప్రైవేట్‌ వైద్యుల కుటుంబాలు పీఎంజీకేవైకి అర్హులే: సుప్రీం

Published on Fri, 12/12/2025 - 04:39

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై) కింద రూ.50 లక్షల బీమా పరిహారానికి అర్హమైనవేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ పీఎంజీకేవై ప్యాకేజీకి ప్రైవేట్‌ వైద్యులు అర్హులు కారంటూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును గురువారం జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం పక్కనబెట్టింది.

 చట్టాలు, నిబంధనల ప్రకారం వైద్యులకు ఉపయోగపడేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలించాలి. పైపెచ్చు, కోవిడ్‌ సమయంలో ఫ్రంట్‌లైన్‌ వైద్యులకు, ఆరోగ్య నిపుణులకు యావత్తూ దేశం దన్నుగా ఉంటుందనే హామీ ఇవ్వడానికి ఉద్దేశించిన బీమా పథకమిది’అని ధర్మాసనం తెలిపింది. ‘పీఎంజీకేవై–ప్యాకేజీ కింద చేసిన బీమా కోసం వ్యక్తిగత క్లెయిమ్‌లు చట్టానికి లోబడి రుజువుల ప్రాతిపదికన పరిశీలించాలి. అనుగుణంగా పరిహారాన్ని నిర్ణయించాలి’అని పేర్కొంది. 

‘కోవిడ్‌ సంబంధిత విధి నిర్వహణలోనే ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయినట్లు నిరూపించే బాధ్యత క్లెయిమ్‌ చేసిన కుటుంబీకులపై ఉంటుంది. నమ్మదగిన సాక్ష్యం ఆధారంగా దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేస్తేనే తప్ప, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు పీఎంజీకేవై ప్యాకేజీ వర్తించదంటూ బాంబే హైకోర్టు 2021లో వెలువరించిన తీర్పును ప్రదీప్‌ అరోరా తదితరులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. 

అంతకుముందు, మహారాష్ట్రలోని థానెలోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో వైద్యుడైన తన భర్త 2020లో కోవిడ్‌ సమయంలో చనిపోయారని, పీఎం జీకేవై ఆయనకు వర్తింప జేయాలంటూ కిరణ్‌ భాస్కరే సుర్గాడే వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన పనిచేసే ఆస్పత్రిని కోవిడ్‌–19 ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించనందున బీమా వర్తింజేయలేమని బీమా కంపెనీ తెలిపింది. కోవిడ్‌ సేవల్లో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం 2020 మార్చిలో పీఎంజీకేవైను ప్రకటించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)