Breaking News

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిందితుడిని పట్టుకోండి

Published on Thu, 11/06/2025 - 06:34

న్యూఢిల్లీ: అదృశ్యమైన మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ సహ వ్యవస్థాపకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దుబాయ్‌ నుండి పారిపోయిన ఆ నిందితుడు, కోర్టులు, దర్యాప్తు సంస్థలతో ఆటలాడుకునే అవకాశం కల్పించవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం, నిందితుడు రవి ఉప్పల్‌ దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడంపై తీవ్రంగా స్పందించింది. భారత్‌ దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకున్న ఉప్పల్, దుబాయ్‌లో ఉండేవాడు. 

అనంతరం అక్కడి నుండి గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయినట్లు సమాచారం. దీంతో యుఏఈ అధికారులు అతడి అప్పగింత ప్రక్రియను మూసివేయడానికి చర్యలు ప్రారంభించాల్సి వచ్చింది. ‘అతన్ని ఎలా పట్టుకోవాలో ముందు తెలుసుకోండి’.. అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

 రాయ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న మనీలాండరింగ్‌ కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు మార్చి 22న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ.. ఉప్పల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఉప్పల్‌ తరపు న్యాయవాది సమయం కోరడంతో, ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్‌ 14కి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం, ఉప్పల్‌ తన భాగస్వామి సౌరభ్‌ చంద్రకర్‌తో కలిసి 2018లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ను ఏర్పాటు చేశాడు. ఇది ఆన్‌లైన్‌ గేమ్‌లపై చట్టవిరుద్ధంగా పందాలకు అనేక యాప్‌లను అనుమతించింది. ఈ స్కాం విలువ రూ.6,000 కోట్లు అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)