Breaking News

అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు

Published on Sat, 01/11/2025 - 04:56

న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్‌ వాదించారు. 

ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్‌ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు ప్రకటించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)