Breaking News

మనీష్‌ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట

Published on Fri, 08/09/2024 - 10:10

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ సీనియర్‌నేత మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. లిక్కర్‌ కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు రెండింటిలో సిసోడియాకు బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం(ఆగస్టు9) ఉదయం తీర్పు వెలువరించింది. బెయిల్‌పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టు సరెండర్‌ చేయాలని కోర్టు షరతు విధించింది. 

ఇటీవలే సిసోడియా బెయిల్‌పై వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కె.వి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. వాదనల సందర్భంగా బెయిల్‌ను ఈడీ,సీబీఐ వ్యతిరేకించినప్పటికీ సిసోడియాకు దేశ అత్యున్నత కోర్టు బెయిల్‌ విషయంలో ఉపశమనం కల్పించింది. 

కేసులో విచారణ ఆలస్యమవుతున్నందునే బెయిల్‌ ఇస్తున్నామని కోర్టు తెలిపింది. బెయిల్‌ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితుడిని జైలులో ఉంచడం అతడి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా 17 నెలలుగా తీహార్‌ జైలులో ఉన్నారు.  

 

Videos

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి కుటుంబం.. మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)